Breaking News

భారత్-పాక్ వివాదం..పీసీబీకి లేఖ రాసిన శ్రీలంక


Published on: 07 Feb 2026 18:37  IST

భారత్‌తో పాకిస్థాన్ మ్యాచ్ ఆడకపోతే ఐసీసీ, బ్రాడ్‌కాస్టర్స్ ఆర్థికంగా తీవ్రంగా నష్టపోయే ప్రమాదముంది. అలాగే శ్రీలంక క్రికెట్ బోర్డుకూ నష్టమే. ఈ నేపథ్యంలో భారత్‌తో మ్యాచ్ విషయంలో తాము తీసుకున్న నిర్ణయాన్ని మరోసారి సమీక్షించుకోవాలని శ్రీలంక.. పాకిస్థాన్ క్రికెట్ బోర్డు(PCB)కు లేఖ రాసింది. తమ నిర్ణయాన్ని పున:పరిశీలించాలని పీసీబీని కోరింది. అయితే ఈ విషయమై పీసీబీ తమ ప్రభుత్వాన్ని సంప్రదించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి