Breaking News

హైదరాబాద్‌లో కాల్పుల కలకలం..


Published on: 31 Jan 2026 10:56  IST

హైదరాబాద్‌లో ఓ వ్యక్తిపై కాల్పులు తీవ్ర కలకలం రేపుతున్నాయి. శనివారం ఉదయం కోఠి (Koti)లోని ఎస్‌బీఐ ఏటీఎం (SBI ATM) సెంటర్ వద్ద రషీద్ అనే వ్యక్తిపై దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో అతడి కాలికి తీవ్ర గాయమైంది. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. ఎస్‌బీఐ ఏటీఎంలో రూ.6లక్షలు డిపాజిట్ చేసేందుకు ఈ రోజు ఉదయం రషీద్ వెళ్లాడు. ఈ విషయాన్ని గమనించిన దుండగులు అతడిపై కాల్పులు జరిపి.. ఆ నగదు మొత్తం తీసుకుని పరారయ్యారు.

Follow us on , &

ఇవీ చదవండి