Breaking News

నాలుగు నెలల చిన్నారిని కొరికి చంపేసిన పెంపుడు కుక్క..!


Published on: 14 May 2025 17:12  IST

గుజరాత్‌లో ఒక షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. అహ్మదాబాద్‌లోని హాతిజాన్ ప్రాంతంలో, ఒక పెంపుడు కుక్క 4 నెలల చిన్నారిపై అత్యంత పాశవికంగా దాడి చేసింది. ఆ కుక్క అకస్మాత్తుగా క్రూరంగా మారి, అమాయక చిన్నారిని ముక్కలు ముక్కలుగా చీల్చి చంపేసింది. కుక్క దాడిలో బాలిక అత్త కూడా గాయపడింది. ఆమెను చికిత్స కోసం ఆసుపత్రిలో చేర్చారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డైంది. ఈ సంఘటన తర్వాత, మరణించిన బాలిక కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.

Follow us on , &

ఇవీ చదవండి