Breaking News

ఫోన్ ట్యాపింగ్ నీచానికి పాల్పడినవారికి శిక్ష తప్పదు


Published on: 02 Feb 2026 10:56  IST

ఫోన్ ట్యాపింగ్ కేసుపై తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోమవారం హైదరాబాద్‌లో మీడియా వేదికగా ఆయన మాట్లాడుతూ.. చట్టం తన పని తాను చేస్తుందని స్పష్టం చేశారు. భార్యాభర్తల సంభాషణలు వినే దుశ్చర్యకు పాల్పడితే విచారణ జరపాలా వద్దా అని ప్రశ్నించారు. తప్పుచేసి మాపైనే అభియోగాలు మోపుతున్నారని ధ్వజమెత్తారు. ఆధారాలు లభించిన నేపథ్యంలో విచారణ జరుగుతోందని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి