Breaking News

ఫ్యాన్స్ అయితే మరీ ఇలా చేస్తారా.. ?


Published on: 02 Feb 2026 15:06  IST

రామ్ చరణ్ తన భార్య ఉపాసనను, కవలలను చూడటానికి తన పెద్ద కుమార్తె క్లీంకారతో కలిసి అపోలో ఆసుపత్రికి చేరుకున్నారు. చరణ్ కారు దిగగానే వందలాది మంది ఫ్యాన్స్ ఒక్కసారిగా అక్కడకు చేరుకున్నారు. చరణ్ తో సెల్ఫీలు దిగేందుకు మీదకు పరిగెత్తారు. కనీసం కారు డోర్ తీసి చరణ్ కిందు దిగడానికి కూడా వీలు లేకుండా చుట్టుముట్టారు. ఆ సమయంలో చరణ్ చేతిలో క్లీంకార ఉంది. అభిమానుల హడావిడి చూసి క్లీంకార సైతం భయపడినట్లు తెలుస్తోంది. దీంతో చరణ్ ఒకింత అసహనానికి గురైనట్లు కనిపిస్తుంది. 

Follow us on , &

ఇవీ చదవండి