Breaking News

బిర్లాపై అవిశ్వాస తీర్మానానికి విపక్షాలు సన్నద్ధం


Published on: 09 Feb 2026 18:01  IST

పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు సజావుగా సాగకపోవడంతో ఇటు అధికార పక్ష సభ్యులు, అటు విపక్ష సభ్యులు అసంతృప్తి వ్యక్తి చేస్తున్నారు. గందరగోళ పరిస్థితుల మధ్య ఉభయసభల కార్యకలాపాలకు తరచు అంతరాయం కలుగుతోంది. సభలో తమను మాట్లాడేందుకు అనుమతించడం లేదంటూ విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా పై అవిశ్వాస తీర్మానం  ప్రవేశపెట్టే యోచనలో విపక్షాలు ఉన్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇప్పటికే నోటీసులు కూడా ఇచ్చినట్టు చెబుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి