Breaking News

ప్రధానికి సీఎం చంద్రబాబు అభినందనలు


Published on: 03 Feb 2026 15:49  IST

భారత్-అమెరికాల మధ్య కుదిరిన చారిత్రక వాణిజ్య ఒప్పందాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్వాగతించారు.ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక స్థిరత్వా నికి చారిత్రాత్మక మైలురాయి అని ఆయన సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పేర్కొన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో ఈ ఒప్పందం కుదరడంపై సీఎం హృదయపూర్వక అభినందనలు తెలిపారు.సుంకాలను 18 శాతానికి తగ్గించడం ద్వారా ప్రపంచంలోని రెండు గొప్ప ప్రజాస్వామ్య దేశాల మధ్య బంధాన్ని మరింత బలోపేతం చేస్తుందన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి