Breaking News

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన రద్దు..


Published on: 04 Feb 2026 17:46  IST

మణిపూర్‌లో రాష్ట్రపతి పాలనను రద్దు చేశారు. ఈ మేరకు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము బుధవారం నాడు ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో ఆ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమమైంది. రాజ్యాంగంలోని 356వ అధికరణలోని క్లాజ్ (2) ద్వారా తనకు సంక్రమించిన అధికారాలతో 2025 ఫిబ్రవరి 13న మణిపూర్‌లో రాష్ట్రపతి పాలన విధిస్తూ జారీ చేసిన ఆదేశాలను రద్దు చేస్తున్నట్టు రాష్ట్రపతి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.2026 ఫిబ్రవరి 4వ తేదీ నుంచి తక్షణమే ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చినట్టు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి