Breaking News

వీధి కుక్కల స్వైరవిహారం..


Published on: 05 Feb 2026 11:50  IST

దౌల్తాబాద్‌ మండలంలో వీధి కుక్కలు రెచ్చిపోతున్నాయి. బుధవారం వేర్వేరు గ్రామాల్లో జరిగిన దాడుల్లో ఓ విద్యార్థి, మూడేళ్ల చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు..కోనాపూర్‌కు చెందిన మైలుగారి చంద్రయ్య కుమారుడు మనోజ్‌ (12) దౌల్తాబాద్‌ మండల కేంద్రంలోని జడ్పీ బాలుర పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. బుధవారం ఉదయం పాఠశాల బస్సు మిస్‌ అవ్వడంతో మనోజ్‌ కాలినడకన బయలుదేరాడు.దారిలో కుక్కల గుంపు ఒక్కసారిగా దాడి చేయడంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి.

Follow us on , &

ఇవీ చదవండి