Breaking News

అవినీతి పార్టీ బీఆర్‌ఎస్‌...


Published on: 05 Feb 2026 18:53  IST

బీఆర్‌ఎస్‌ అవినీతి పార్టీ అని కేసీఆర్‌ బిడ్డ కవితనే చెబుతున్నదని కార్మికశాఖ మంత్రి, జిల్లా ఇన్‌చార్జి వివేక్‌వెంకటస్వామి విమర్శించారు. బీఆర్‌ఎస్‌ హయాంలో మిషన్‌ భగీరథ పేరిట రూ.65 వేల కోట్ల రూపాయలు దోచుకున్నారని ఆయన ఆరోపించారు. మెదక్‌, రామాయంపేట, నర్సాపూర్‌లో మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో ఆయన పాల్గొని మాట్లాడారు. బీఆర్‌ఎస్‌ పదేళ్ల పాలనలో రాష్ట్ర రూ. 8లక్షల కోట్ల అప్పులు ప్రజల నెత్తిన రుద్దారని, వడ్డీలకే ప్రతీ నెల రూ. 5వేల కోట్ల వడ్డీ కడుతున్నామని తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి