Breaking News

800 మంది మిస్సింగ్‌ వార్తలు..


Published on: 06 Feb 2026 18:53  IST

దిల్లీలో 800 మందికి పైగా మిస్ అయ్యారంటూ ఆంగ్ల మీడియాలో పెద్దఎత్తున కథనాలు వచ్చాయి. 15 రోజుల వ్యవధిలోనే వారంతా అదృశ్యమయ్యారని వాటి సారాంశం. ఆ వార్తలపై తాజాగా దిల్లీ పోలీసులు స్పందించారు. ‘‘దిల్లీలో వ్యక్తులు తప్పిపోతున్నారనే వార్తలకు పెయిడ్‌ ప్రమోషన్స్ కారణమని మేం గుర్తించాం. స్వార్థ ప్రయోజనాల కోసం చేసే ఇలాంటి ప్రచారాలను ఎట్టి పరిస్థితుల్లోను సహించబోం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని పోలీసులు ఎక్స్ వేదికగా ఓ పోస్టు పెట్టారు.

Follow us on , &

ఇవీ చదవండి