Breaking News

ఆడుకుంటున్న బాలుడిపై దారుణంగా..


Published on: 07 Feb 2026 12:12  IST

తాజాగా సంగారెడ్డి జిల్లా ఇంద్రేశం మున్సిపాలిటీలో ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఐదేళ్ల బాలుడు శివపై ఐదు వీధి కుక్కలు ఒక్కసారిగా విరుచుకుపడ్డాయి. ఆ చిన్నారిని చుట్టుముట్టి తీవ్రంగా గాయపరిచాయి. బాలుడి ఆర్తనాదాలు విన్న స్థానికులు వెంటనే స్పందించి కుక్కలను తరిమికొట్టడంతో పెద్ద ప్రమాదం తప్పింది.కుక్కల దాడిలో తీవ్ర రక్తగాయాలైన శివను పఠాన్‌చెరు ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి