Breaking News

బైక్‌ రేసింగ్‌ పోటీలకు.. సై


Published on: 07 Feb 2026 16:52  IST

జాతీయస్థాయి మోటార్‌ బైక్‌ ఛాంపియన్‌షిప్‌ పోటీలు శనివారం సాయంత్రం నగరంలోని ఇందిరా ప్రియదర్శిని మున్సిపల్‌ స్టేడియంలో జరగనున్నాయి. పోటీల్లో పాల్గొనేందుకు వివిధ ప్రాంతాల నుంచి విశాఖ చేరుకున్న 70 మంది రైడర్లు శుక్రవారం రాత్రి స్టేడియంలో ట్రయల్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా సాహస విన్యాసాలతో పలువురిని ఆకట్టుకున్నారు. నగర పోలీస్‌కమిషనర్‌ శంఖబ్రతబాగ్చీ స్టేడియంలో ఏర్పాట్లు పరిశీలించారు.శనివారం పోటీల నేపథ్యంలో భద్రత కట్టుదిట్టం చేశామన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి