Breaking News

దరఖాస్తులు 82 లక్షలు.. అర్హులు 18 లక్షలే!


Published on: 16 May 2025 11:37  IST

తెలంగాణ రైతు రుణమాఫీ, కల్యాణలక్ష్మి తదితర పథకాల మాదిరిగానే ఇందిరమ్మ ఇండ్ల పథకాన్ని సైతం అరకొరగా అమలుచేసి మమ అనిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 82 లక్షల దరఖాస్తులను వడపోసి తొలి విడత అర్హుల జాబితాలో 18 లక్షల మంది దరఖాస్తుదారులను మాత్రమే చేర్చడం ఇందుకు నిదర్శనం. ఇందిరమ్మ ఇండ్లు పథకం అమలు విషయానికి వచ్చేసరికి రకరకాల నిబంధనలతో చాలామంది దరఖాస్తుదారులను అనర్హుల జాబితాలో చేర్చి చేతులు దులుపుకుంటున్నది.

Follow us on , &

ఇవీ చదవండి