Breaking News

తమది అసలు తుర్కియే సంస్థే కాదని:సెలెబీ ప్రకటన


Published on: 16 May 2025 14:16  IST

ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోన్న పాకిస్థాన్‌కు అండగా నిలిచిన తుర్కియేకు మన దేశంలో నిరసన సెగ తగులుతోంది. ఆ దేశానికి చెందిన వస్తువులు, సేవలను నిషేధించాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలోనే భారతీయ విమానాశ్రయాలలో సరకుల రవాణాతోపాటు బహువిధ సేవలు అందిస్తున్న తుర్కియే కంపెనీ ‘సెలెబీ ఎయిర్‌పోర్ట్‌ సర్వీసెస్‌ ఇండియా లిమిటెడ్‌’కు ఉన్న అనుమతులను కేంద్రం రద్దు చేసింది. దీనిపై ఆ కంపెనీ స్పందించింది. తమది అసలు తుర్కియే సంస్థే కాదని వెల్లడించింది.

Follow us on , &

ఇవీ చదవండి