Breaking News

హైదరాబాద్ ఓల్డ్ సిటీలో మరో భారీ అగ్ని ప్రమాదం


Published on: 20 May 2025 18:18  IST

హైదరాబాద్ పాతబస్తీ ఛత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలోని బోయిగూడలో జీ ప్లస్ 2 బిల్డింగ్ లో మంటలు వ్యాపించాయి. ఈ మేరకు 2025, మే 20వ తేదీ మంగళవారం మధ్యాహ్నం అగ్నిమాపక సిబ్బందికి సమాచారం వచ్చింది. జీ ప్లస్ 2 బిల్డింగ్ లోని.. సెకండ్ ఫ్లోర్ చెప్పుల గోదాం ఉంది. ఆ ఫ్లోర్ లో పెద్ద ఎత్తున మంటలు వచ్చాయి.స్థానికుల సమాచారంతో ఫైర్ సిబ్బంది స్పాట్ కు చేరుకున్నారు. రెండు ఫైర్ ఇంజిన్లు మంటలను అదుపులోకి తెచ్చాయి. ఈ ప్రమాదంలో ఎవరూ చనిపోలేదు.. ఆస్తి నష్టం జరిగింది. ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి