Breaking News

స్కూల్ బస్సుపై ఉగ్రదాడి..నలుగురు పిల్లలు మృతి


Published on: 21 May 2025 15:05  IST

ఉగ్రవాదులు మరోసారి అమాయక ప్రజలపై దాడులకు పాల్పడ్డారు. ఈ క్రమంలో పాకిస్థాన్‎ బలూచిస్తాన్ ప్రావిన్స్‌లో ఒక స్కూల్ బస్సును లక్ష్యంగా చేసుకుని బాంబు దాడి (Terror Attack School Bus) చేశారు. ఈ ఘటనలో నలుగురు పిల్లలు అక్కడికక్కడే మరణించగా, మరో 38 మంది గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించారు. ఈ పేలుడును అక్కడి హోంమంత్రి మొహ్సిన్ నఖ్వీ తీవ్రంగా ఖండించారు. 

Follow us on , &

ఇవీ చదవండి