Breaking News

ఆర్సీబీ ఎఫెక్ట్‌.. ఒక్క రోజే 157 కోట్ల మ‌ద్యం అమ్మ‌కాలు


Published on: 04 Jun 2025 18:43  IST

ఫైన‌ల్లో పంజాబ్‌పై ఆర్సీబీ అద్భుత విజ‌యాన్ని న‌మోదు చేసింది. అయితే ఆ సంద‌ర్భాన్ని క‌ర్నాట‌క ప్ర‌జ‌లు తెగ ఎంజాయ్ చేశారు. మ‌ద్యం తాగే క్రికెట్ అభిమానులు అయితే.. ఫుల్ జోష్‌తో నిండిపోయారు. మంళ‌వారం ఒక్క రోజే క‌ర్నాట‌క‌లో అత్య‌ధిక స్థాయిలో మ‌ద్యం అమ్ముడుపోయింది. లిక్క‌ర్ సేల్స్ ద్వారా 157 కోట్లు ఆర్జించారు. జూన్ 3వ తేదీన ఒక్క రోజే సుమారు 1.48 ల‌క్ష‌ల బీరు బాక్సులు అమ్ముడుపోయిన‌ట్లు తెలుస్తోంది. ఆ మ‌ద్యం అమ్మ‌కాల ద్వారా సుమారు 30.66 కోట్ల ఆదాయం వ‌చ్చింది.

Follow us on , &

ఇవీ చదవండి