Breaking News

అనారోగ్య సమస్యలకు హాజరు నిబంధన సరికాదు


Published on: 05 Jun 2025 10:57  IST

అనారోగ్య కారణాలతో తరగతులకు హాజరుకాలేకపోయిన విద్యార్థికి హాజరు తక్కువుగా ఉందనే కారణంతో మూడవ సెమిస్టర్‌ పరీక్ష ఫలితాలు వెల్లడించకపోవడం సరికాదని హైకోర్టు స్పష్టం చేసింది. నాలుగో సెమిస్టర్‌కు అనుమతించకపోవడాన్ని తీవ్రంగా ఆక్షేపించింది. నిబంధనల ప్రకారం అనారోగ్య సమస్యలు తలెత్తినప్పుడు హాజరును 10శాతం వరకే మినహాయించగలమని జీఎంఆర్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ్‌స కళాశాల యాజమాన్యం చెప్పడాన్ని తప్పుబట్టింది. ఆ నిబంధన ప్రభుత్వ సంస్థలు రూపొందించలేదని పేర్కొంది.

Follow us on , &

ఇవీ చదవండి