Breaking News

రేషన్‌కార్డు దరఖాస్తు వెబ్‌సైట్‌ క్లోజ్‌!


Published on: 05 Jun 2025 12:46  IST

రేషన్‌కార్డు అర్హులైన వారు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చు.. ఇది కొత్త రేషన్‌ కార్డుల జారీపై కాంగ్రెస్‌ సర్కారు ప్రజలకు ఇచ్చిన అనేక హామీలలో ఒకటి. కానీ ప్రస్తుతం వెబ్‌సైట్‌ను మూసివేయడంతో మీ-సేవలో దరఖాస్తుల ప్రక్రియ నిలిచిపోయింది. వెబ్‌సైట్‌లో ‘అప్లికేషన్‌ ఫర్‌ న్యూ ఫుడ్‌ సెక్యురిటీ కార్డ్‌ సర్వీస్‌ ఈజ్‌ నాట్‌ అవలెబుల్‌ ఎట్‌ ప్రజెంట్‌’ అనే మేసేజ్‌ దర్శనమిస్తున్నది. దీంతో కొత్త రేషన్‌కార్డు కోసం, మార్పులు, చేర్పుల కోసం మీ-సేవ కేంద్రాలకు వెళ్లిన వారంతా నిరాశతో వెనుదిరుగుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి