Breaking News

అస్వ‌స్థ‌త‌కు గురైన మంత్రి కొండా సురేఖ‌


Published on: 05 Jun 2025 16:41  IST

రాష్ట్ర స‌చివాల‌యంలో కేబినెట్ మీటింగ్‌కు వెళ్తూ.. దేవాదాయ, అట‌వీ శాఖ మంత్రి కొండా సురేఖ స్వ‌ల్ప అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు. క‌ళ్లు తిరిగి ఆమె కింద ప‌డిపోయారు. ఈ ఘ‌ట‌న స‌చివాల‌యం ఆరో అంత‌స్తులో చోటు చేసుకోగా, అక్క‌డే ఉన్న ఎమ‌ర్జెన్సీ మెడిక‌ల్ టీం మంత్రికి ప్ర‌థ‌మ చికిత్స అందించారు. లో బీపీ కార‌ణంగా క‌ళ్లు తిరిగిప‌డిపోయిన‌ట్టు స‌మాచారం. కొండా సురేఖ ఆరోగ్య ప‌రిస్థితిపై సీఎం రేవంత్ రెడ్డి ఆరా తీశారు. ఆమె ఆరోగ్య ప‌రిస్థితిపై వైద్యుల‌ను అడిగి సీఎం వివ‌రాలు తెలుసుకున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి