Breaking News

చరిత్ర సృష్టించిన జొకోవిచ్.. 57 ఏళ్లలో ఇదే తొలిసారి!


Published on: 05 Jun 2025 19:01  IST

ప్రముఖ టెన్నిస్ ఆటగాడు, సెర్బియా స్టార్ నొవాక్ జొకోవిచ్ చరిత్ర సృష్టించాడు. ప్రతిష్టాత్మక ఫ్రెంచ్ ఓపెన్-2025 టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరాడు. 38 ఏళ్ల జొకోవిచ్.. అత్యధిక వయసులో ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరిన వారిలో ఒకడిగా అరుదైన ఘనత సాధించాడు.1968 తర్వాత రొలాండ్ గారోస్‌లో ఈ ఫీట్ నమోదు చేసిన తొలి ఆటగాడిగా అతడు నిలిచాడు. ఓవరాల్‌గా చూసుకుంటే.. అత్యధిక వయసులో ఫ్రెంచ్ ఓపెన్ సెమీఫైనల్‌కు చేరిన వారి జాబితాలో 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు జొకోవిచ్.

Follow us on , &

ఇవీ చదవండి