Breaking News

వెయ్యి మంది బాలురు.. 907 మందే బాలికలు


Published on: 11 Jun 2025 07:43  IST

తెలంగాణలో గత ఆరేళ్లలో ఎన్నడూలేనంత తక్కువగా.. 2022లో ప్రతి వెయ్యిమంది బాలురకు 907 మంది అమ్మాయిలు మాత్రమే జన్మించారు. ఈ మేరకు బాలురు, బాలికల జననాల నిష్పత్తి జాబితాలో తెలంగాణ దేశంలో దిగువ నుంచి మూడో స్థానంలో ఉంది. తెలంగాణ తర్వాత బిహార్‌ (891), మహారాష్ట్ర (906)లు మాత్రమే ఉన్నాయి. ఏపీలో ఇది 938గా నమోదైంది. ఈ మేరకు దేశవ్యాప్తంగా 2022లో జనన, మరణాల నివేదికను కేంద్ర జనాభా లెక్కల విభాగం తాజాగా విడుదల చేసింది.

Follow us on , &

ఇవీ చదవండి