Breaking News

పరీక్షలు మొదలయ్యాయి ఆపలేం.. డీఎస్సీపై సుప్రీం


Published on: 12 Jun 2025 19:00  IST

ఏపీలో మెగా డీఎస్సీ పరీక్షల నిలిపివేతకు సుప్రీం కోర్టు నిరాకరించింది. మెగా డీఎస్సీ పరీక్షలపై స్టే ఇవ్వాలంటూ దాఖలైన పిటిషన్‌పై విచారణకు సుప్రీం విముఖత చూపించింది. ఈ కేసులో ఏపీ హైకోర్ట్‌ను ఆశ్రయించాలని పిటిషనర్‌కు ధర్మాసనం సూచించింది. జూన్ 16 నుంచి హైకోర్టు పునః ప్రారంభమైన తరువాత అక్కడే పిటిషన్‌ దాఖలు చేయాలని సుప్రీం తెలిపింది. మెగా డీఎస్సీ ఇప్పటికే ప్రారంభమైనందున వాటిని నిలిపివేయలేమని జస్టిస్ పీకే మిశ్రా నేతృత్వంలోని ధర్మాసనం తేల్చిచెప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి