Breaking News

ఎయిర్ ఇండియా విమానానికి బాంబు బెదిరింపు..


Published on: 13 Jun 2025 14:49  IST

థాయిలాండ్‌లోని ఫుకెట్ నుండి ఢిల్లీకి వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం AI 379 బాంబు బెదిరింపు రావడంతో థాయిలాండ్‌లో అత్యవసరంగా ల్యాండ్ చేయాల్సి వచ్చింది. విమానంలో ఉన్న 156 మంది ప్రయాణికులను సురక్షితంగా తరలించారు. విమానం అండమాన్ సముద్రం మీదుగా ప్రదక్షిణలు చేసి, ఆపై ఫుకెట్ విమానాశ్రయంలో తిరిగి దిగింది. బెదిరింపులకు పాల్పడింది ఎవరన్న విషయం ఇంకా తేలాల్సిఉంది. అహ్మదాబాద్ ప్రమాదం జరిగిన ఒక రోజు తర్వాత ఈ సంఘటన చోటు చేసుకోవడం ఆందోళన కలిగిస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి