Breaking News

ఏపీ ప్రభుత్వ హెలికాప్టర్‌లో సాంకేతిక సమస్య


Published on: 16 Jun 2025 14:44  IST

ఏపీ పర్యటనలో ఉన్న కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ కృష్ణపట్నం పర్యటన రద్దైంది. తిరుపతి నుంచి కృష్ణపట్నం వెళ్లేందుకు హెలికాప్టర్ ఎక్కిన తర్వాత, దానిలో సాంకేతిక లోపం బయటపడింది. దీంతో పీయూష్ గోయల్‌ పర్యటనను తాత్కాలికంగా రద్దు చేసుకున్నారు. ఈ పరిణామంతో ఏపీ సర్కార్ అప్రమత్తమైంది. ముఖ్యమంత్రి సహా వీవీఐపీలు వినియోగించే హెలికాప్టర్లలో సాంకేతిక, భద్రతా సమస్యలపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని డీజీపీ సంబంధిత అధికారులను ఆదేశించారు.

Follow us on , &

ఇవీ చదవండి