Breaking News

యోగా ఏర్పాట్లను పరిశీలించిన సీఎం చంద్రబాబు


Published on: 16 Jun 2025 17:50  IST

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విశాఖపట్నంలో పర్యటించారు. ఈ నెల 21న జరగనున్న అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలో రాష్ట్ర ప్రభుత్వం భారీ స్థాయిలో ‘యోగాంధ్ర’ పేరుతో ఏర్పాటు చేస్తున్న కార్యక్రమానికి సంబంధించి ఏర్పాట్లను ఆయన స్వయంగా సమీక్షించారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొననున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి లోపాలు లేకుండా పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని నిశ్చయించుకుంది.

Follow us on , &

ఇవీ చదవండి