Breaking News

అమెరికాకు షాకిచ్చేందుకు సిద్ధంగా టెహ్రాన్‌..!


Published on: 18 Jun 2025 16:02  IST

‘బేషరతుగా లొంగిపోవాలి’, ‘అణ్వాయుధాలు వదిలేయాల్సిందే’ అని అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ పదేపదే ప్రకటనలు చేస్తున్న నేపథ్యంలో ఇరాన్‌ అప్రమత్తమైంది. ఒకవేళ వాషింగ్టన్‌ కూడా టెల్‌అవీవ్‌తో చేతులు కలిపి దాడిచేస్తే.. తగిన జవాబు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని ‘న్యూయార్క్‌ టైమ్స్‌’ పత్రిక కథనంలో వెల్లడించింది. అమెరికా జోక్యం చేసుకొంటే.. వాటి స్థావరాలపై దాడి చేస్తానని ఇప్పటికే ఇరాన్‌ తేల్చిచెప్పింది.

Follow us on , &

ఇవీ చదవండి