Breaking News

ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్న పాక్‌


Published on: 25 Jun 2025 16:31  IST

భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌ తర్వాత చైనా మద్దతుతో పాక్‌ తన అణ్వాయుధ సామగ్రిని అప్‌గ్రేడ్‌ చేయాలని భావించింది. అందుకు అనుగుణంగానే పాకిస్థాన్ అత్యంత రహస్యంగా ఖండాంతర బాలిస్టిక్ క్షిపణులను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిసింది. ఈ క్షిపణులు 5,500 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న లక్ష్యాలను కూడా ఛేదించగలవని సమాచారం. ఈ మేరకు అమెరికా నిఘా సంస్థలు సంచలన విషయాలు వెల్లడించాయి. అమెరికాలోని పలు లక్ష్యాలను కూడా ఈ క్షిపణులు తాకగలవని తెలిపాయి.

Follow us on , &

ఇవీ చదవండి