Breaking News

తన వారసుడి ఎంపికపై దలైలామా సంచలన ప్రకటన


Published on: 02 Jul 2025 16:38  IST

బౌద్ధ మత గురువు దలైలామా కీలక ప్రకటన చేశారు. తన మరణం తర్వాత కూడా తన వారసత్వం కొనసాగుతుందంటూ చైనాకు షాక్ ఇచ్చారు. తన వారసుడిని ఎన్నుకునే బాధ్యత టిబెటన్ల చేతుల్లోనే ఉంటుందని ప్రకటించారు. జూలై 6న తన 90వ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన ఈ ప్రకటన చేశారు. 15వ దలైలామాను ఎంపిక చేసే హక్కు గాడెన్ ఫోడ్రాంగ్ ట్రస్టుకు మాత్రమే ఉందని.. మరెవరికీ ఆ హక్కు లేదని చెప్పారు. తాజాగా దలైలామ ప్రకటన చైనాకు పెద్ద ఝలక్ గా చెప్పొచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి