Breaking News

సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు


Published on: 08 Jul 2025 17:16  IST

హైద‌రాబాద్ న‌గ‌రంలోని సిటీ సివిల్ కోర్టుకు బాంబు బెదిరింపు ఫోన్ కాల్ వ‌చ్చింది. సిటీ సివిల్ కోర్టులో బాంబు పెట్టిన‌ట్లు గుర్తు తెలియ‌ని దుండ‌గుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు కోర్టు కార్య‌క‌లాపాల‌ను నిలిపివేశారు. కోర్టు సిబ్బందిని బ‌య‌ట‌కు పంపించేశారు. బాంబు స్క్వాడ్, డాగ్ స్క్వాడ్‌తో పోలీసులు త‌నిఖీలు నిర్వ‌హిస్తున్నారు. చీఫ్ మెజిస్ట్రేట్ కార్యాల‌యాన్ని మూసివేశారు. న్యాయ‌వాదులు, సిబ్బంది తీవ్ర ఆందోళ‌న‌కు గుర‌వుతున్నారు.

Follow us on , &

ఇవీ చదవండి