Breaking News

వికాసం వైపు ఏపీ అడుగులు: సత్యకుమార్‌


Published on: 11 Jul 2025 14:13  IST

ప్రపంచ ప్రఖ్యాత ఎకానమిస్ట్‌ ఇంటెలిజెన్స్‌ యూనిట్‌ నివేదిక పరిశీలిస్తే ఏపీ వికాసం వైపు ఉరకలేస్తోందన్న విషయం స్పష్టమవుతోందని ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌ పేర్కొన్నారు. పెట్టుబడులను ఆకర్షించడంలో ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం.. తమిళనాడు, గుజరాత్‌, మహారాష్ట్రాలతో పోటీ పడుతూ అత్యంత ఆకర్షణీయ రాష్ట్రంగా ఉందని ఈఐయూ నివేదిక విడుదల చేసినట్లు గురువారం ఆయన ఒక ప్రకటనలో తెలిపారు. ఈ గణనీయ మార్పు సీఎం చంద్రబాబు బ్రాండ్‌ విలువను తెలియజేస్తోందని పేర్కొన్నారు.

Follow us on , &

ఇవీ చదవండి