Breaking News

డ్రగ్స్ దందాలో పోలీసు ఉన్నతాధికారి సుపుత్రుడు..


Published on: 15 Jul 2025 17:14  IST

హైదరాబాద్ డ్రగ్స్ దందాలో ఎస్ఐబీ అధికారి(ఓఎస్డీ) కొడుకు పాత్రను ఈగిల్ అధికారులు గుర్తించారు. మల్నాడు రెస్టారెంట్ యజమాని సూర్య అమ్మినేని అరెస్ట్ తర్వాత పోలీసులు ఆ నెట్ వర్క్‌పై దర్యాప్తు చేస్తున్న సందర్భంగా ఎస్ఐబీ అధికారి కొడుకు పాత్ర తెరపైకి వచ్చింది. ఈ సూర్యతో అరెస్ట్ అయిన ఆరుగురిని ఈగిల్ అధికారులు కోర్టు అనుమతితో కస్టడీలోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ విచారణలో మరికొంత మంది సెలబ్రిటీలతో పాటు ప్రముఖుల చిట్టా బయటపడే అవకాశం ఉందని తెలుస్తోంది.

Follow us on , &

ఇవీ చదవండి