Breaking News

బీసీ రిజర్వేషన్ల అంశంలో కీలక పరిణామం


Published on: 15 Jul 2025 17:41  IST

బీసీ రిజర్వేషన్ల అంశంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. బీసీ రిజర్వేషన్ల అంశంలో పంచాయతీరాజ్ చట్టం -2018లోని సెక్షన్ 285(A)కు సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ముసాయిదాను ఇప్పటికే పంచాయతీ రాజ్ శాఖ సిద్ధం చేసింది. గవర్నర్ ఆమోదం పొందగానే ఆర్డినెన్స్ నోటిఫికేషన్ వెలువడనుంది. ఆ వెంటనే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల ఖరారు కోసం.. ఇప్పటికే ఉభయసభలు ఆమోదించిన బిల్లు, కులగణన సర్వే ఎంపిరికల్ డేటా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక జీవో ఇస్తుంది.

Follow us on , &

ఇవీ చదవండి