Breaking News

రాబోయే నాలుగు రోజుల్లో అతి భారీ వర్షాలు


Published on: 21 Jul 2025 16:46  IST

బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనంతో పాటు ద్రోణి ప్రభావం కొనసాగుతోందని.. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాబోయే నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. నిన్నటి వరకు ఉన్న ఉపరితల ఆవర్తనం, దక్షిణ ఒడిశా, పరిసర ప్రాంతాల్లో సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి నైరుతి దిశగా ప్రయాణిస్తోందని వెల్లడించారు.

Follow us on , &

ఇవీ చదవండి