Breaking News

సుప్రీంకోర్టుకు విజయ్ టీవీకే పార్టీ...


Published on: 29 Aug 2025 14:35  IST

తమిళ నటుడు విజయ్‌ ఏర్పాటు చేసిన టీవీకే పార్టీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. పరువు హత్యలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని సుప్రీంలో టీవీకే పార్టీ పిటిషన్‌ దాఖలు చేసింది. రాష్ట్రంలో ఓ దళిత సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దళిత సాఫ్ట్‌వేర్‌కు న్యాయం జరగాలని కోరుతూ.. పరువు హత్యలపై ప్రత్యేక చట్టం తీసుకురావాలని టీవీకే ధర్మాసనాన్ని ఆశ్రయించింది.

Follow us on , &

ఇవీ చదవండి