Breaking News

కూలిన ఫైటర్‌ జెట్‌.. ఎగసిపడ్డ మంటలు..


Published on: 29 Aug 2025 15:35  IST

సెంట్రల్‌ పోలాండ్‌లోని రాడోమ్‌లో ఎయిర్‌షో కోసం రిహార్సల్‌ చేస్తుండగా పోలిష్‌ వైమానికి దళానికి చెందిన F-16 యుద్ధ విమానం ఒక్కసారిగా కూలిపోయింది. ఈ ప్రమాదంలో పైలట్‌ ప్రాణాలు కోల్పోయినట్లు పోలాండ్‌ ఉప ప్రధాని వ్లాడిస్లా కోసినియాక్‌ వెల్లడించారు. ఈ మేరకు ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేపట్టినట్లు తెలిపారు. మరోవైపు రిహార్సల్స్‌ను తిలకిస్తున్న స్థానికులు జెట్‌ కూలడాన్ని తమ కెమెరాల్లో బంధించి సోషల్‌ మీడియాలో పోస్టు చేయగా.. ప్రస్తుతం ఆ వీడియో వైరల్‌గా మారింది.

Follow us on , &

ఇవీ చదవండి