Breaking News

ఉత్తరాఖండ్‌లో మరో క్లౌడ్‌ బరస్ట్‌..


Published on: 29 Aug 2025 15:45  IST

ఉత్తరాది రాష్ట్రాల్లో భారీ వర్షాలతో వాగులు, వంకలు, నదులు పొంగిపొర్లుతున్నాయి. ఉత్తరాఖండ్‌ లోని రుద్రప్రయాగ్‌, చమోలీ జిల్లాల్లో కురుస్తున్న కుండపోత వర్షం పలు గ్రామాలను ముంచెత్తుతోంది. ఉత్తరాఖండ్‌లో తాజాగా మరోసారి మేఘ విస్ఫోటం సంభవించింది. ఈ విపత్తులో పలువురు ప్రాణాలు కోల్పోగా పలుచోట్ల ఇళ్లు కూలడంతో పదుల సంఖ్యలో ప్రజలు శిథిలాల కింద చిక్కుకున్నారు. ఎప్పటికప్పుడు వరద ప్రవాహాన్ని అంచనా వేస్తూ లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు అధికారులు

Follow us on , &

ఇవీ చదవండి