Breaking News

కేసీఆర్‌తో కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు


Published on: 04 Sep 2025 14:48  IST

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు (KTR) గత నాలుగు రోజులుగా ఎర్రవల్లి ఫాంహౌస్‌లోనే ఉన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో (KCR) కేటీఆర్ సుదీర్ఘ మంతనాలు జరుపుతున్నారు. కాళేశ్వరంపై సీబీఐ విచారణ, కవిత ఎపీసోడ్‌పై ఇద్దరు నేతలు సమాలోచనలు చేస్తున్నారు. కవిత ఆరోపణలపై ఇప్పటివరకూ కేసీఆర్, కేటీఆర్ స్పందించలేదు. మాజీ మంత్రి హరీష్‌రావు, మాజీ ఎంపీ సంతోష్ రావులపై కవిత ఆరోపణలకు ఒకరిద్దరు బీఆర్ఎస్ సీనియర్లు కౌంటర్ ఇచ్చారు.

Follow us on , &

ఇవీ చదవండి