Breaking News

న్యాయవాదుల విధుల బహిష్కరణ


Published on: 09 Sep 2025 16:09  IST

ఒక కేసు విషయంలో ఎన్ బి డబ్ల్యూ నోటీసులు ఇవ్వడానికి వెళ్లిన ఆదిలాబాద్ న్యాయవాదులు కౌషిక్ సింగ్, మనోజ్‌లపై నిందితులు దాడి చేయడాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్ జిల్లా కోర్టు న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా కోర్టు ఎదుట బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో న్యాయవాదులు ఆందోళన చేపట్టారు. న్యాయవాదుల రక్షణ చట్టం వెంటనే అమలు చేయాలన్నారు. లేనట్లయితే ఆందోళనలు మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

Follow us on , &

ఇవీ చదవండి