Breaking News

కేటీఆర్‌కు అరుదైన అంతర్జాతీయ గౌరవం


Published on: 11 Sep 2025 14:04  IST

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు అరుదైన అంత‌ర్జాతీయ గౌర‌వం ద‌క్కింది. న్యూయార్క్‌లో కేటీఆర్‌కు ‘గ్రీన్ లీడర్‌షిప్’ అవార్డు వ‌రించింది. సుస్థిర పాలనలో (sustainable governance) కేటీఆర్ అంతర్జాతీయ గుర్తింపు పొందారు. సెప్టెంబర్ 24న 9వ ఎన్‌వైసీ గ్రీన్ స్కూల్ కాన్ఫరెన్స్‌లో కేటీఆర్‌కు అవార్డు ప్రదానం చేయ‌నున్నారు. మున్సిపల్ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన కేటీఆర్ హైదరాబాద్‌లో హరితం(గ్రీనరీ) అభివృద్ధికి, చేసిన కృషికి ప్రశంసలు కురిపించారు .

Follow us on , &

ఇవీ చదవండి