Breaking News

ప్రధాని మోదీ బర్త్ డే గిఫ్టుల వేలం


Published on: 17 Sep 2025 11:11  IST

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు (సెప్టెంబర్ 17) తన 75వ పుట్టినరోజు జరుపుకుంటున్నారు. భారత్ సహా విదేశాల నుంచి ఆయనకు అభిమానులు పింపిన బహుమతులు ఈ-వేలం వేస్తారు. గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ బహుమతులలో పెయింటింగ్‌లు, అయోధ్య రామాలయం సహా అనేకం ఉన్నాయి. ఈ వేలం సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2 వరకు ఆన్‌లైన్‌లో జరుగుతుందన్నారు. ఆసక్తి ఉన్నవారు pmmementos.gov.in వెబ్‌సైట్ ద్వారా ఈ వస్తువులను చూసి, వేలంలో పాల్గొనవచ్చు.

Follow us on , &

ఇవీ చదవండి