Breaking News

అమెరికాకు భారీగా తగ్గిన భారత ఎగుమతులు..!


Published on: 17 Sep 2025 12:24  IST

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ విధించిన టారిఫ్‌లు భారత ఎగుమతుల (Exports to US) పై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. వీటి ఫలితంగా మన దేశ వస్తువుల ధరలు అమెరికా లో భారీగా పెరిగిపోయి.. పోటీ తట్టుకోలేని స్థితి నెలకొంది. ఈ విషయాన్ని గ్లోబల్‌ ట్రేడ్‌ రీసెర్చి ఇనిషియేటివ్‌ సంస్థ వెల్లడించింది.ఆగస్టు నెలలో అమెరికాకు ఎగుమతులు 16.3 శాతం తగ్గి 6.7 బిలియన్‌ డాలర్లకు చేరాయి. టారిఫ్‌లు పెరిగి 50 శాతానికి చేరడంతో ఒక్కసారిగా ఎగుమతుల్లో తగ్గుదల కనిపించింది.

Follow us on , &

ఇవీ చదవండి