Breaking News

బ్రిటిష్ హైకమిషనర్‌తో సీఎం రేవంత్ భేటీ...


Published on: 18 Sep 2025 14:16  IST

భారత బ్రిటిష్ హైకమిషనర్ లిండీ కామెరాన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు (గురువారం) జూబ్లీహిల్స్ నివాసంలో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా యూకే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అందించే చెవెనింగ్ స్కాలర్ షిప్ కో-ఫండింగ్ ప్రాతిపదికన తెలంగాణ మెరిట్ విద్యార్థులకు ఇచ్చేందుకు లిండీ కామెరాన్ అంగీకరించారు. ఎడ్యుకేషన్, టెక్నాలజీ సంబంధిత రంగాల్లో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నట్లు ముఖ్యమంత్రికి బ్రిటిష్ హైకమిషనర్ వివరించారు.

Follow us on , &

ఇవీ చదవండి