Breaking News

నడి వీధిలో సింగరేణి మాజీ ఉద్యోగి దారుణ హత్య..!


Published on: 23 Sep 2025 15:06  IST

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి బయటకు లాక్కెళ్లి మరీ గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు సింగరేణి విశ్రాంత ఉద్యోగిని కిరాతకంగా హత్య చేశారు. మృతుడిని కొత్తగూడెం 3 టౌన్ పరిధిలోని గణేష్ టెంపుల్ ఏరియాలో గుబ్బల రామ్మోహన్ రావుగా పోలీసులు గుర్తించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. హంతకుల కోసం ముమ్మర గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి