Breaking News

130వ రాజ్యాంగ సవరణ బిల్లు..


Published on: 25 Sep 2025 11:22  IST

లోక్‌‌సభలో ప్రవేశపెట్టిన రాజ్యాంగ (130వ సవరణ) బిల్లు ప్రధాన ఉద్దేశం రాజ్యాంగ నైతికతను నిలబెట్టడం, ప్రభుత్వ వ్యవస్థలపై ప్రజల విశ్వాసాన్ని పెంపొందించడం. బిల్లు ప్రతిపాదకుల వాదన ప్రకారం, ప్రజల ఆశలు, ఆకాంక్షలకు ప్రతిరూపాలుగా ఉన్న ప్రజా ప్రతినిధులు, ఎలాంటి సందేహాలకు తావు లేకుండా అత్యున్నత ప్రమాణాలను పాటించాలి. ఒక మంత్రి తీవ్రమైన నేరారోపణలతో అరెస్టై, నిర్బంధంలో ఉన్నప్పుడు, అది ప్రజా విశ్వాసాన్ని తీవ్రంగా దెబ్బతీస్తుంది అని ప్రభుత్వ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి