Breaking News

సాహితీ ఇన్‌ఫ్రా కేసులో కీలక మలుపు..


Published on: 25 Sep 2025 15:03  IST

నటుడు జగపతిబాబు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ED) ఎదుట హాజరయ్యారు. జగపతి బాబుని నాలుగు గంటలపాటు ఈడీ అధికారులు విచారించినట్లు సమాచారం. సాహితీ ఇన్‌ఫ్రా కేసులో ఆయన్ను ఈడీ విచారణకు పిలిచింది. సాహితీ తరఫున పలు ప్రకటనలో నటించిన జగపతిబాబుకు, సాహితీ కంపెనీకి మధ్య ఆర్థిక లావాదేవీలు జరిగాయన్న ఆరోపణల మధ్య ఈడీ విచారించింది. సాహితీ లక్ష్మీనారాయణ కంపెనీ అకౌంట్‌లో నుంచి జగపతిబాబుకు నగదు బదిలీ అయినట్లు గుర్తించినట్లు అధికారులు తెలిపారు.

Follow us on , &

ఇవీ చదవండి