Breaking News

బాసరలో వైభవంగా నవరాత్రి


Published on: 29 Sep 2025 11:56  IST

ప్రముఖ పుణ్యక్షేత్రం బాసర జ్ఞాన సరస్వతీ దేవి ఆలయంలో నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. మహాగౌరి అలంకరణలో అమ్మవారుల భక్తులకు దర్శనమిస్తున్నారు. నేడు అమ్మవారి జన్మ నక్షత్రం మూల నక్షత్ర పర్వదినం సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భారీగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆలయంలోని క్యూలైన్లు, అక్షరాభ్యాస మంటపాలు భక్తులతో కిక్కిరిసిపోతున్నాయి.

Follow us on , &

ఇవీ చదవండి