Breaking News

మరోసారి హైడ్రా దూకుడు..


Published on: 10 Oct 2025 12:57  IST

నగరంలో హైడ్రా మరోసారి దూకుడు పెంచింది. ప్రభుత్వ ఆస్తులు, చెరువులను రక్షించడమే లక్ష్యంగా పెట్టుకున్న హైడ్రా.. తాజాగా భాగ్యనగరంలో ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలంలో కూల్చివేతలు చేపట్టింది. బంజారాహిల్స్‌లోని బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి సమీపంలో 5 ఎకరాల ప్రభుత్వ స్థలం ఆక్రమణకు గురైంది. స్థానికుల ఫిర్యాదు మేరకు ఈరోజు (శుక్రవారం) హైడ్రా కూల్చివేతలు చేపట్టింది. సుమారు రూ.750 కోట్ల విలువైన ప్రభుత్వ స్థలంలో ఆక్రమణలను హైడ్రా తొలగించింది.

Follow us on , &

ఇవీ చదవండి