Breaking News

మద్యం కుంభకోణంలో కీలక మలుపు


Published on: 13 Oct 2025 12:43  IST

మద్యం కుంభకోణం కేసులో ప్రధాన నిందితులైన పలువురికి ఈ నెల 16వ తేదీ వరకు రిమాండ్‌ను విజయవాడ ఏసీబీ కోర్టు పొడిగించింది.ఇదిలా ఉంటే, ఈ కేసులో నిందితుడిగా ఉన్న రాజంపేట వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, ఈ నెల 20వ తేదీ నుంచి న్యూయార్క్ వెళ్లేందుకు అనుమతి ఇవ్వాలంటూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ అభ్యర్థనపై స్పందించిన కోర్టు, సిట్ అధికారులు కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. దీనిపై తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Follow us on , &

ఇవీ చదవండి